e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు సిద్ధం: జోఫ్రా ఆర్చర్‌

ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు సిద్ధం: జోఫ్రా ఆర్చర్‌

ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు సిద్ధం: జోఫ్రా ఆర్చర్‌

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించాడు.
చేతి గాయం నుంచి కోలుకోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఆర్చర్‌ ససెక్స్‌ తరఫున పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో అతడు రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


కరోనా కారణంగా 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడగా మరికొన్ని నెలల్లో ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్చర్ స్పందించాడు. ఈ ఏడాది చివర్లో టోర్నమెంట్‌ మళ్లీ జరిగితే లీగ్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడాలనుకుంటున్నట్లు ఆర్చర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు సెప్టెంబర్‌ విండోలో లీగ్‌లోని మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు సిద్ధం: జోఫ్రా ఆర్చర్‌

ట్రెండింగ్‌

Advertisement