శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 16, 2020 , 13:16:57

బయో సెక్యూర్‌ రూల్స్‌ బ్రేక్‌..ఆర్చర్‌ టీమ్‌ నుంచి ఔట్‌

బయో సెక్యూర్‌ రూల్స్‌  బ్రేక్‌..ఆర్చర్‌ టీమ్‌ నుంచి ఔట్‌

మాంచెస్టర్‌:  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను   బయో సెక్యూర్‌ వాతావరణంలో  నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది, అంపైర్లు,  వ్యాఖ్యాతలు ఇలా అందరూ బయో సెక్యూర్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.   పటిష్ట జాగ్రత్తలతో ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించారు.  

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు తుదిజట్టులో ఉన్న ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను టీమ్‌ నుంచి తప్పించారు.  ‌ బయో సెక్యూర్‌ ప్రొటోకాల్స్‌ను ఆర్చర్‌ ఉల్లంఘించాడని మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు పక్కనపెట్టేశారు.  ఐతే ఆర్చర్‌ ఏ నియమ నిబంధనలను బ్రేక్‌ చేశాడనేదానిపై ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించలేదు. అతని స్థానంలో ఎవరిని తుదిజట్టుకు ఎంపిక చేశారనే విషయాన్ని టాస్‌ సమయంలో కెప్టెన్‌ జో రూట్‌ వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది.  మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ విండీస్‌ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. logo