సోమవారం 06 జూలై 2020
Sports - Jun 30, 2020 , 08:16:18

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌!

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌!

లండన్‌:  స్వదేశంలో వెస్టిండీస్‌తో  ఆరంభమయ్యే తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ దూరంకానున్నాడు. తన భార్య  ప్రసవించే అవకాశం ఉండటంతో రూట్‌  జట్టును వీడనున్నాడు.  రూట్‌ స్థానంలో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌  తొలిసారి తాత్కాలికంగా జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.  తొలి టెస్టు మ్యాచ్‌ జరిగే సమయంలోనే  రూట్‌ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనున్నది.  రూట్‌ రెండో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

కరోనా నిబంధనల ప్రకారం అతడు తన భార్య దగ్గరకు వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ జట్టుతో కలిసే ముందు ఏడు రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో టెస్టు సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా  నిలిచిపోయిన క్రికెట్‌ మూడు నెలల విరామం అనంతరం మళ్లీ మొదలవబోతున్నది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సౌతాంప్టన్‌ వేదికగా జూలై 8న ప్రారంభంకానుంది.  


logo