ఆదుకున్న రూట్

గాలే: కెప్టెన్ జో రూట్ (77 బంతుల్లో 67 బ్యాటింగ్) అజేయ అర్ధశతకంతో నిలువడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కోలుకుంది. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో అతడు సత్తాచాటడంతో శనివారం రెండో రోజును ఇంగ్లిష్ జట్టు 98/2తో ముగించింది. రూట్‌తో పాటు జానీ బెయిర్‌స్టో (24) క్రీజులో ఉన్నాడు. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లిష్ జట్టు ఇంకా 283 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు 381 పరుగుల వద్ద శ్రీలంక ఆలౌటైంది. 229/4 ఓవర్‌నైట్ స్కోరు వద్ద ఏంజెలో మాథ్యూస్ (110), రమేశ్ మెండిస్ రెండో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించగా.. 15 నిమిషాల్లోనూ ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నిరోషన్ డిక్వెలా (92) వేగంగా ఆడడం సహా చివర్లో దిల్రువాన్ పెరెరా (67) ఆకట్టుకోవడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ ఆరు వికెట్లు, మార్క్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టారు.
మెక్‌గ్రాత్‌ను అధిగమించిన అండర్సన్
లంక ఆటగాడు డిక్వెలాను ఔట్ చేయడం ద్వారా అండర్సన్ టెస్టుల్లో 30వ సారి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజం మెక్‌గ్రాత్ (29)ను వెనక్కినెట్టి ఆరో స్థానానికి చేరాడు. మురళీధరన్ (67), షేన్ వార్న్ (37), సర్ రిచర్డ్ హాడ్లీ (36), కుంబ్లే (35), హెరాత్ (34) అండర్సన్కంటే ముందున్నారు.
తాజావార్తలు
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్‌లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్‌లో కాదు.. సౌథాంప్టన్‌లో..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా
- అన్ని సార్లూ అన్నం మంచిది కాదట!
- మహిళలు చేసిన వస్తువులు కొన్న ప్రధాని మోదీ