బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 21:15:19

పోరాడిన కెప్టెన్‌ జో రూట్‌

 పోరాడిన కెప్టెన్‌ జో రూట్‌

గాలె: శ్రీలంకతో రెండో టెస్టులో ఇంగ్లాండ్‌  కెప్టెన్‌ జో రూట్‌(186: 309 బంతుల్లో 18ఫోర్లు) అదరగొట్టాడు. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అద్భుత ఆటతీరుతో ఆదుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 98/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ మూడో రోజు, ఆదివారం ఆట చివరికి 339/9తో నిలిచింది. 

లంక బౌలర్‌  ఎంబుల్డేనియా(7/132) ధాటికి ఓవైపు ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నా రూట్‌ ఒంటరి పోరాటం చేశాడు. డబుల్‌ సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. జోస్‌ బట్లర్‌(55) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు.  మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది.  ప్రస్తుతం జాక్‌ లీచ్‌(0) క్రీజులో ఉండగా జేమ్స్‌ ఆండర్సన్‌ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. 

VIDEOS

logo