చరిత్ర సృష్టించిన జో రూట్.. వందవ టెస్టులో డబుల్ సెంచరీ

చెన్నై: టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సరికొత్త అధ్యాయం లిఖించాడు. వందవ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించాడు. చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ శైలిని ప్రదర్శించాడు. బౌలర్లకు సహకరించని చిదంబరం స్టేడియంలో.. రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ భారీ సిక్సర్‌తో జో రూట్ తన ఖాతాలో డబుల్ సెంచరీ వేసుకున్నాడు. ఫ్లాట్‌గా ఉన్న పిచ్‌పై చాలా సులువుగా రూట్ తన షాట్లు ఆడాడు. అతని డబుల్ సెంచరీలో 19 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. నాలుగో వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రూట్.. స్టోక్స్ నిష్క్రమణ తర్వాత ద్విశతకాన్ని అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై రూట్ తన స్టయిలిస్ ఆటను కొనసాగించాడు. ఎటువంటి చెత్త షాట్లు ఆడకుండా.. భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టాడు. టాఫ్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ చెన్నై మైదానంలోనూ తన ఆటతీరుతో అలరించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రూట్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌలర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. రెండవ రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లకు 454 రన్స్ చేసింది. రూట్ 209, పోప్ 24 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
తాజావార్తలు
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
- సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం
- సైనిక స్థావరంలో భారీపేలుడు.. 20 మంది మృతి
- ప్రకటన పెట్టి.. బోల్తా కొట్టిస్తారు