శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 06, 2021 , 15:22:28

84ఏండ్ల తర్వాత ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌ రూట్‌

84ఏండ్ల తర్వాత ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌ రూట్‌

చెన్నై: టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్‌మన్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మాన్‌ తర్వాత వరుసగా 150కు పైగా పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా ఇంగ్లీష్‌ సారథి రూట్‌ నిలిచాడు.  

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్‌ ఈ ఫీట్‌ సాధించాడు. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రూట్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 1937లో టెస్టు క్రికెట్‌లో వరుసగా 150కి పైగా రన్స్‌ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా బ్రాడ్‌మాన్‌ చరిత్ర సృష్టించాడు. 

84ఏండ్ల తర్వాత 150+ స్కోర్లతో హ్యాట్రిక్‌ మైలురాయి అందుకున్న మొదటి కెప్టెన్‌గా రూట్‌ నిలవడం విశేషం.  ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ సూపర్‌ ఫామ్‌లో రూట్‌ వరుసగా 228, 186 పరుగులతో చెలరేగాడు. 

VIDEOS

logo