సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Jul 31, 2020 , 18:40:03

చివరి రెండు వన్డేలకు జో డెన్లీ దూరం

చివరి రెండు వన్డేలకు  జో డెన్లీ  దూరం

సౌతాంప్టన్‌: ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ అలవోకగా విజయం  సాధించిన విషయం తెలిసిందే. రాయల్‌ లండన్‌ సిరీస్‌లో భాగంగా  ఐర్లాండ్‌తో మిగతా రెండు వన్డేలకు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ ‌ జో డెన్లీ దూరమయ్యాడు.  వెన్నునొప్ప కారణంగా సిరీస్‌ను అతడు తప్పుకున్నాడు. డెన్లీ స్థానంలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌  ఇంగ్లాండ్‌ 14 మంది సభ్యుల జట్టుతో కలవనున్నాడు. బుధవారం ట్రైనింగ్‌ సమయంలో  డెన్లీకి  గాయం కావడంతో  అతడు తొలి వన్డేలో కూడా ఆడలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0తో ఆధిక్యంలో ఉన్నది. రెండో వన్డే శనివారం  జరగనుంది.


logo