బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 18:33:17

బర్స్స్‌కు లైన్‌ క్లియర్‌..పుకోస్కీ ఔట్‌

బర్స్స్‌కు లైన్‌ క్లియర్‌..పుకోస్కీ ఔట్‌

మెల్‌బోర్న్‌: భారత్‌తో గులాబీ టెస్టులో గాయపడిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ జో బర్న్స్‌ రెండో టెస్టు ఆడేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. మోచేతి గాయం తీవ్రత చిన్నదే కావడంతో బర్న్స్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.     కంకషన్‌ నుంచి కోలుకుంటున్న యువ ఓపెనర్‌ విల్‌ పుకోస్కీ  బాక్సింగ్‌ డే టెస్టుకు  దూరమయ్యాడని తెలిసింది. 

భారత బౌలర్‌ బుమ్రా విసిరిన బంతి బర్న్స్‌ మోచేతికి బలంగా తాకిన విషయం తెలిసిందే.   తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలిచిన  ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి ఉంది. రెండో టెస్టు డిసెంబర్‌ 26న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆరంభంకానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

సిద్దార్థ్‌, శ‌ర్వానంద్‌కు దిల్ రాజు పార్టీ

యువ డైరెక్ట‌ర్లంతా ఒక్క‌చోట చేరారు

బిగ్ బాస్ 4: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు..?

బిగ్ బాస్ 4 ఫినాలేకు దేవి నాగవల్లి డుమ్మా..కారణమేంటో..?


logo