లీడ్స్: కొత్తగా ప్రవేశ పెట్టిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (43 బంతుల్లో 92 నాటౌట్; 17 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించింది. శనివారం ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్చార్జర్స్ తరఫున బరిలోకి దిగిన జెమీమా మైదానం నలుమూలలా బౌండ్రీలతో విరుచుకుపడింది. మొదట ఫైర్ జట్టు నిర్ణీత బంతుల్లో 8 వికెట్లకు 130 పరుగులు చేయగా.. జెమీమా విజృంభణతో సూపర్చార్జర్ 85 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.