గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 00:37:18

జయేశ్‌ రంజన్‌కు లైన్‌క్లియర్‌

 జయేశ్‌ రంజన్‌కు లైన్‌క్లియర్‌
  • టీవోఏ ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. జయేశ్‌ నామినేషన్‌ను ఆమోదించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) బి.చంద్రకుమార్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. టీవోఏ అధ్యక్ష పదవికి తన నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఆర్వో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జయేశ్‌ రంజన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ శుక్రవారం విచారణ జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతితోనే రేసులో నిలిచానని జయేశ్‌ న్యాయస్థానానికి వివరించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి .. జయేశ్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. ఈ నెల 9వ తేదీన టీవోఏ ఎన్నికలు జరుగనుండగా.. అధ్యక్ష పదవి కోసం జయేశ్‌, కె.రంగారావు పోటీ పడుతున్నారు.
logo