శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 27, 2020 , 00:25:13

టీవోఏ అధ్యక్ష బరిలో జయేశ్‌ రంజన్‌

టీవోఏ అధ్యక్ష బరిలో జయేశ్‌ రంజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పోటీకి దిగారు. అలాగే, ప్రధాన కార్యదర్శి రేసులో తెలంగాణ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు నిలిచారు. ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో టీఓఏ ఎన్నికల నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. సమయం ముగిసే సరికి అన్ని పదవుల కోసం మొత్తం 57  నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ బి.చంద్ర కుమార్‌ తెలిపారు. జయేశ్‌ రంజన్‌ తరఫున జగన్‌మోహన్‌ రావు నామినేషన్‌ దాఖలు చేశారు. అధ్యక్ష పదవి రేసులో జయేశ్‌తో పాటు జితేందర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ కే రంగారావు ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి ఆరు, ప్రధాన కార్యదర్శి స్థానం కోసం 2, కోశాధికారి పదవికి 5 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 ఆఖరు తేదీ.


logo