ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 31, 2021 , 00:56:25

ఆసియా క్రికెట్‌ అధ్యక్షుడిగా షా

ఆసియా క్రికెట్‌ అధ్యక్షుడిగా షా

న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. శనివారం జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ స్థానంలో షా బాధ్యతలు చేపట్టాడు. ‘కరోనా కష్టకాలంలోనూ ఏసీసీ సమర్థవంతంగా పనిచేసింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తాం’ అని జై షా అన్నాడు. ఏసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జై షాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘షా పనితీరు నాకు తెలుసు. అతడి ప్లానింగ్‌ అమోఘం. ఆటపట్ల అతడి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి’ అని దాదా పేర్కొన్నాడు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.

VIDEOS

logo