సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 13, 2020 , 01:45:14

బుమ్రాకు ఉమ్రిగర్‌ అవార్డు

 బుమ్రాకు ఉమ్రిగర్‌ అవార్డు

ముంబై: టీమ్‌ఇండియా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రతిష్ఠాత్మక పాలీ ఉమ్రిగర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018-19 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకుగాను భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఆదివారం అతడికి ఈ అవార్డు ప్రకటించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రా.. ఈ సీజన్‌లో టెస్టుల్లోనూ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దీంతో పురుషుల విభాగంలో ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పురస్కారం అతడికి దక్కింది. ఈ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి అందించారు. దీంతో పాటు అతడికి దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు కూడా అతడిని వరించింది. మహిళల విభాగంలో దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం పూనమ్‌ యాదవ్‌ను వరించింది. దీంతో పాటు ఆమెకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌ అవార్డు కూడా దక్కింది. మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్‌, అంజుమ్‌ చోప్రాలకు కర్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. టీమ్‌ఇండియా తరఫున మయాంక్‌ అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్ర ఆటగాడి అవార్డు దక్కగా.. మహిళల విభాగంలో ఇది 15 ఏండ్ల షఫాలీ వర్మను వరించింది. రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఆల్‌రౌండర్‌ శివం దూబేకు లాలా అమర్‌నాథ్‌ అవార్డు లభించింది.logo