సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 18, 2020 , 11:52:28

బుమ్రాకు రెండు వికెట్లు.. ఆసీస్ 35/2

బుమ్రాకు రెండు వికెట్లు.. ఆసీస్ 35/2

హైద‌రాబాద్‌:  అడిలైడ్‌లో జ‌రుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా రెండ‌వ రోజు త‌న తొలి ఇన్నింగ్స్ తొలి సెష‌న్‌లో రెండు వికెట్లు కోల్పోయి 35 ర‌న్స్ చేసింది.  స్పీడ్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు.  ఆసీస్ ఓపెన‌ర్లు మాథ్యూ వేడ్‌(8), జో బ‌ర్న్స్‌(8) స్వ‌ల్ప స్కోర్ల‌కే బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యారు.  తొలి బ్రేక్ స‌మ‌యానికి ల‌బుష‌నే 16, స్మిత్ ఒక ప‌రుగుతో క్రీజ్‌లో ఉన్నారు. అంత‌కుముందు రెండ‌వ రోజు ఆట మొద‌లుపెట్టిన ఇండియా బ్యాట్స్‌మెన్ త్వ‌రిత‌గ‌తిన పెవిలియ‌న్ చేరారు.  ఆరు వికెట్ల‌కు 233 ర‌న్స్ వ‌ద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. కేవ‌లం మ‌రో 11 ప‌రుగులు జోడించి నాలుగు వికెట్ల‌ను కోల్పోయింది. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 244 ర‌న్స్‌కు ఆలౌటైంది. స్టార్క్‌కు 4 వికెట్లు ద‌క్క‌గా, క‌మ్మిన్స్ ఖాతాలో మూడు వికెట్లు ప‌డ్డాయి.