సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 13:46:32

‘బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడడం కష్టం’

‘బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడడం కష్టం’

న్యూఢిల్లీ: భారత స్పీడ్​స్టర్ జస్పీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లు ఎక్కువ కాలం ఆడలేడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాది చాలా క్లిష్టమైన బౌలింగ్ యాక్షన్ అని, దీంతో అతడు త్వరగా నడుము గాయానికి గురవుతాయని కామెంటేటర్ అకాశ్ చోప్రాతో ఓ ఇంటర్వ్యూలో అక్తర్ చెప్పాడు. అలాగే ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సైతం ఎక్కువ కాలం రాణిస్తాడని తాను అనుకోవడం లేదని అన్నాడు.

 “జస్పీత్​ బుమ్రాది చాలా కష్టమైన బౌలింగ్ యాక్షన్​. అన్ని ఫార్మాట్లు అతడు ఆడలేడు. అతడు టెస్టు క్రికెట్ ఆడడం సాహసోపేతమే. బుమ్రా చాలా కష్టపడుతూ ఏకాగ్రతగా ఉంటాడు. కానీ అతడి నడుము పరిస్థితి ఏంటి.? యాక్షన్ వల్ల అతడు బంతి వేసేటప్పుడు నడుముపై తీవ్ర ఒత్తిడి పడుతున్నది. దీనివల్ల అతడిని నడుము గాయం తొందరగా వస్తుందనుకుంటున్నా” అని అక్తర్ అన్నాడు.  

 

 


logo