మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 13, 2020 , 00:15:25

బుమ్రా నంబర్‌వన్‌ చేజారె

 బుమ్రా నంబర్‌వన్‌ చేజారె

దుబాయ్‌: భారత స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వన్డేల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 719 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క వికెట్‌ తీయని బుమ్రా..తన ర్యాంకింగ్‌ పాయింట్లను కోల్పోయాడు. ఇదే సిరీస్‌లో ఆరు వికెట్లతో రాణించిన లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌ 622 పాయింట్లతో 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.   భారత్‌తో సిరీస్‌కు దూరమైన కివీస్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(727).. బుమ్రాను వెనుకకు నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా నాయక ద్వయం కోహ్లీ(869), రోహిత్‌శర్మ(855) టాప్‌-2లో కొనసాగుతున్నారు. 


logo