శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 31, 2021 , 15:23:41

కుంబ్లే బౌలింగ్‌ను అనుక‌రించిన బుమ్రా.. వీడియో

కుంబ్లే బౌలింగ్‌ను అనుక‌రించిన బుమ్రా.. వీడియో

చెన్నై: త‌న వింత బౌలింగ్ యాక్ష‌న్‌ను అనుక‌రించ‌డానికి దేశంలోని ఎంతోమంది పిల్ల‌లు ప్ర‌య‌త్నిస్తుంటే.. టీమిండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా మాత్రం లెజెండ‌రీ బౌల‌ర్ అనిల్ కుంబ్లేను అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ అచ్చూ కుంబ్లే ఎలా లెగ్ స్పిన్ వేస్తాడో అలాగే వేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ వీడియోను బీసీసీఐ త‌న ట్విట‌ర్‌లో షేర్ చేసింది. బుమ్రా నుంచి భ‌యంక‌ర‌మైన యార్క‌ర్లు, బౌన్స‌ర్లు చూశాం. ఇప్పుడు గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని బౌలింగ్ యాక్ష‌న్ చూడండి అంటూ బీసీసీఐ ఆ ట్వీట్ చేసింది. 

దీనిపై కుంబ్లే కూడా స్పందించాడు. దాదాపుగా త‌న బౌలింగ్‌ను స‌రిగ్గానే అనుక‌రించాడ‌ని చెబుతూ ప్రెట్టీ క్లోజ్ అని కుంబ్లే రిప్లై ఇచ్చాడు. నీ బౌలింగ్ యాక్ష‌న్‌ను అనుక‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ఎంతో మంది త‌ర్వాతి త‌రం బౌల‌ర్ల‌కు నువ్వొక ఇన్‌స్పిరేష‌న్‌. వ‌చ్చే సిరీస్ కోసం ఆల్ ద బెస్ట్ అని కుంబ్లే ట్వీట్ చేశాడు. 

VIDEOS

logo