e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News బుమ్రా బ్లండ‌ర్‌.. ఒక జెర్సీకి బ‌దులు మ‌రో జెర్సీ

బుమ్రా బ్లండ‌ర్‌.. ఒక జెర్సీకి బ‌దులు మ‌రో జెర్సీ

బుమ్రా బ్లండ‌ర్‌.. ఒక జెర్సీకి బ‌దులు మ‌రో జెర్సీ

సౌథాంప్ట‌న్‌: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఇండియ‌న్ టీమ్ స్ట్రైక్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ప‌రిస్థిలుల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఐదో రోజు ఆట‌లో ఓ పెద్ద పొర‌పాటు చేశాడత‌డు. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఐసీసీ ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన జెర్సీ కాకుండా రెగ్యుల‌ర్ టీమిండియా జెర్సీతో బ‌రిలోకి దిగాడు. ఐదో రోజు త‌న తొలి ఓవ‌ర్ మొత్తం ఇదే జెర్సీతో బౌలింగ్ చేశాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్న బుమ్రా ఓవ‌ర్ల మ‌ధ్య‌లో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి కొత్త జెర్సీ వేసుకొని వ‌చ్చాడు.

ఏ ఐసీసీ ఈవెంట్ అయినా స‌రే ఆట‌గాళ్ల జెర్సీల‌పై దేశం పేరు మ‌ధ్య‌లో ఉంటుంది త‌ప్ప స్పాన్స‌ర్ పేరు కాదు. కావాలంటే స్లీవ్స్‌పై స్పాన్న‌ర్ పేరు ఉండొచ్చు. బుమ్రా వేసుకున్న జెర్సీ మ‌ధ్య‌లో టీమిండియా స్పాన్స‌ర్ పేరు ఉంది. ప‌రిమితి ఓవ‌ర్ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌డం దాదాపు అసాధ్యం. కానీ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ తొలిసారి జ‌రుగుతుండ‌టంతో బుమ్రా మ‌ర‌చిపోయిన‌ట్లున్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బుమ్రా బ్లండ‌ర్‌.. ఒక జెర్సీకి బ‌దులు మ‌రో జెర్సీ
బుమ్రా బ్లండ‌ర్‌.. ఒక జెర్సీకి బ‌దులు మ‌రో జెర్సీ
బుమ్రా బ్లండ‌ర్‌.. ఒక జెర్సీకి బ‌దులు మ‌రో జెర్సీ

ట్రెండింగ్‌

Advertisement