మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Jul 26, 2020 , 16:52:47

జేసన్‌ హోల్డర్‌..2000+ పరుగులు & 100+ వికెట్లు

జేసన్‌ హోల్డర్‌..2000+ పరుగులు & 100+  వికెట్లు

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో హోల్డర్‌ 2వేల పరుగుల మైలురాయిని  అధిగమించాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హోల్డర్‌ ఈ రికార్డు అందుకున్నాడు. ఇంగ్లీష్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న  హోల్డర్‌(46) అర్ధశతకానికి  4 పరుగుల దూరంలో  ఔటయ్యాడు.

విండీస్‌ తరఫున  టెస్టుల్లో 2వేలకు పైగా పరుగులు, 100కు పైగా వికెట్లు పడగొట్టిన మూడో  క్రికెటర్‌గా  నిలిచాడు. హోల్డర్‌ కన్నా ముందు గ్యారీ సోబర్స్‌, కార్ల్‌ హూపర్‌ ఈ ఫీట్‌ సాధించారు.  ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక టెస్టులో విండీస్‌  తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 62 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.  షేన్‌ డౌరిచ్‌(28), రఖీమ్‌ కార్న్‌వాల్‌(10) క్రీజులో ఉన్నారు. 


logo