శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 08, 2020 , 22:43:42

విలియమ్సన్‌ అర్ధశతకం

విలియమ్సన్‌ అర్ధశతకం

అబుదాబి: ఐపీఎల్‌-13 క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ అర్ధశతకం సాధించాడు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతున్నా కేన్‌ ఒక్కడే పోరాడుతున్నాడు.   ఢిల్లీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. 35 బంతుల్లో 2ఫోర్లు,4సిక్సర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో కేన్‌కిది 15వ అర్ధశతకం.

14 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 4 వికెట్లకు 113 పరుగులు చేసింది. విలియమ్సన్‌(55), అబ్దుల్‌ సమద్‌(3) క్రీజులో ఉన్నారు.  స్వల్ప స్కోరుకే టాపార్డర్‌ పెవిలియన్‌ చేరడంతో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది.  రబాడ, స్టాయినీస్‌ దెబ్బకు పవర్‌ప్లే ఆఖరికి హైదరాబాద్‌ 49/3తో కష్టాల్లో పడింది.