శనివారం 24 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 17:15:20

IPL 13: జేసన్‌ హోల్డర్‌ వచ్చేశాడు..!

IPL 13: జేసన్‌ హోల్డర్‌ వచ్చేశాడు..!

దుబాయ్: వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ యూఏఈలో అడుగుపెట్టాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో హోల్డర్‌ చేరనున్నాడు. కరోనా నేపథ్యంలో హోల్డర్‌ ఆరు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం అతడు హోటల్‌ రూమ్‌లోనే ఉన్నాడు. ఆరు రోజుల్లో మూడు సార్లు నిర్వహించే కరోనా పరీక్షల్లో ఫలితం మూడు సార్లు నెగెటివ్‌గా వస్తేనే అతడు సన్‌రైజర్స్‌ జట్టుతో కలిసే వీలుంటుంది.

యూఏఈకి వచ్చే ఏ క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఇలా ఎవరైనా కనీసం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌ వ్యవధిని పూర్తి చేయాలి. కరోనా టెస్టుల్లో నెగెటివ్‌గా తేలితో బయో బబుల్‌లోకి ప్రవేశించవచ్చు.  బెంగళూరుతో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో హోల్డర్‌ను సన్‌రైజర్స్‌ తీసుకున్నది. logo