బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 18, 2020 , 01:21:49

జపాన్‌ ఒలింపిక్‌ అధికారికి కరోనా

జపాన్‌ ఒలింపిక్‌ అధికారికి కరోనా

టోక్యో: విశ్వక్రీడల నిర్వహణపై అనుమానాలు పెరుగుతున్న తరుణంలో.. ఏకంగా జపాన్‌ ఒలింపిక్‌ కమిటీ(జేవోసీ) డిప్యూటీ చీఫ్‌ కొజో తషిమాకు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ఆయనే మంగళవారం వెల్లడించాడు. ‘పరీక్షల్లో నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. జ్వరంతో పాటు నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ క్షేమంగానే ఉన్నా. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడంపై ఏకాగ్రతతో ఉన్నా’ అని తషిమా వెల్లడించాడు. ఫిబ్రవరి 28నుంచి ఐర్లాండ్‌, నెదర్లాండ్‌, అమెరికా దేశాల్లో పర్యటించి జపాన్‌కు వచ్చాక కూడా అనేక సమావేశాల్లో తషిమా పాల్గొన్నాడు. ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా మంగళవారం తేలింది. మరోవైపు ఇప్పటికే గ్రీస్‌లో వెలిగిన ఒలింపిక్‌ జ్యోతి శుక్రవారం నాటికి ఉత్తర జపాన్‌ ప్రాంతానికి చేరుకోనుంది. 


logo
>>>>>>