గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 20:10:26

సౌతాఫ్రికా జట్టులో జానేమాన్‌ మలాన్‌..

సౌతాఫ్రికా జట్టులో జానేమాన్‌ మలాన్‌..

హైదరాబాద్‌: త్వరలో సౌతాఫ్రికా జట్టు ఇండియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రొటీస్‌ జట్టు.. భారత్‌తో మూడు వన్డేలు ఆడనున్నది. కాగా, సీఎస్‌ఏ(క్రికెట్‌ సౌత్‌ ఆఫ్రికా) భారత్‌లో పర్యటించనున్న తమ జట్టును ఇదివరకే ప్రకటించింది. క్వింటాన్‌ డీ కాక్‌ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. తాజాగా, సీఎస్‌ఏ.. జట్టులో మరో అదనపు ఆటగాడిని చేర్చింది. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ జానేమాన్‌ మలాన్‌ను జట్టులో 16వ సభ్యుడిగా ప్రకటించింది. ఈ నెల 12న ధర్మశాలలో మొదటి మ్యాచ్‌ ఆడనున్న ఇరుజట్లు.. 15న లక్నోలో రెండో వన్డే, 18న కలకత్తాలో మూడో వన్డే ఆడనున్నాయి. భారత్‌లో పర్యటించే దక్షిణాఫ్రికా జట్టు రేపు ఉదయం బయల్దేరనున్నది. 

సౌతాఫ్రికా జట్టు:

క్వింటాన్‌ డీ కాక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కైల్‌ వెర్రెయ్‌న్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, జాన్‌-జాన్‌ స్మట్స్‌, ఫెలాక్వియో, లుంగీ ఎంగిడీ, లుతో సిపామ్ల, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, ఆన్రిచ్‌ నోర్టీ, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌, జానెమాన్‌ మలాన్‌.


logo
>>>>>>