ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 22:24:11

బెన్‌స్టోక్స్‌ మెరుపు అర్ధసెంచరీ

బెన్‌స్టోక్స్‌ మెరుపు అర్ధసెంచరీ

అబుదాబి: ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ నిలకడగా ఆడుతోంది. ముంబై పేసర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ దెబ్బకు రాజస్థాన్‌ 44 పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్‌ బెన్‌ స్టోక్స్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. సంజూ శాంసన్‌ ఆచితూచి ఆడుతున్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న స్టోక్స్‌ 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం స్టోక్స్‌(53), శాంసన్‌(16) క్రీజులో ఉన్నారు.