e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home టాప్ స్టోరీస్ మూడో మొనగాడు.. 20వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన జొకోవిచ్‌

మూడో మొనగాడు.. 20వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన జొకోవిచ్‌

మూడో మొనగాడు.. 20వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన జొకోవిచ్‌
  • ఫెదరర్‌, నాదల్‌ను సమం చేసిన నొవాక్‌
  • వింబుల్డన్‌ ఫైనల్‌లో బెర్‌టినిపై విజయం

మహామహుల మధ్య మాయగాడిలా టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన.. ఆరడుగుల సెర్బియా వీరుడు చూస్తుండగానే దిగ్గజాల సరసన చేరిపోయాడు. వింబుల్డన్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్న జోకర్‌కు.. ఈ సీజన్‌లో ఇది వరుసగా మూడో టైటిల్‌ కావడం విశేషం. నాలుగేండ్లలో ఎనిమిది టైటిల్స్‌ ఖాతాలో వేసుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గిన రోజర్‌ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌ (20)ను సమం చేశాడు. కోర్టులో చిత్ర విచిత్ర హావభావాలతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో దిట్ట అయిన జొకో.. వింబుల్డన్‌ ఫైనల్లో బెర్‌టినిపై అలవోక విజయంతో 20వ టైటిల్‌ చేజిక్కించుకొని ముగ్గురు మొనగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

లండన్‌: కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. ఈ సీజన్‌లో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఇప్పటి వరకు ఐదుసార్లు విజేతగా నిలిచిన జొకో.. తాజా విజయంతో సిక్సర్‌ కొట్టాడు. ఆదివారం ఇక్కడి సెంటర్‌ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ఏడో సీడ్‌ బెర్‌టిని (ఇటలీ)పై గెలుపొందాడు. 3 గంటల 24 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో ప్రత్యర్థికంటే తక్కువ ఏస్‌లే కొట్టిన జొకో.. అనవసర తప్పిదాల జోలికి పోకుండా ముందుకు సాగాడు. మరోవైపు 16 ఏస్‌లు 57 విన్నర్‌లతో జొకోకు అందనంత ఎత్తులో నిలిచిన బెర్‌టిని 48 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

- Advertisement -

భళా బెర్‌టిని
ఈ టోర్నీలో మొత్తం 101 ఏస్‌లు కొట్టి అగ్రభాగాన నిలిచిన బెర్‌టిని ఈ మ్యాచ్‌లోనూ తన జోరు చూపెడుతూ తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆడుతున్నది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ అయినప్పటికీ ఏమాత్రం తడబడకుండా ముందుకు సాగిన 25 ఏండ్ల బెర్‌టిని.. ఒక దశలో టాప్‌సీడ్‌ జొకోకు చుక్కలు చూపాడు. అయితే రెండో సెట్‌లో బుల్లెట్‌ సర్వీస్‌లతో తిరిగి పోటీలోకి వచ్చిన 34 ఏండ్ల జొకోవిచ్‌.. బ్యాక్‌హ్యాండ్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో చెలరేగి వరుసగా మూడు సెట్‌లు చేజిక్కించుకున్నాడు. పోరాటంలో జొకోకు సమ ఉజ్జీలాగా కనిపించిన బెర్‌టిని కీలక సమయాల్లో ఒత్తిడికి లోనై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 1877లో వింబుల్డన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరుకు చైర్‌ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా మరిజా సియాక్‌ రికార్డు సృష్టిస్తే.. 1969లో రాడ్‌ లావెర్‌ తర్వాత సీజన్‌లో తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్రకెక్కాడు.

వింబుల్డన్‌ బాలుర సింగిల్స్‌లో భారత సంతతికి చెందిన అమెరికా చిన్నోడు సమీర్‌ బెనర్జీ విజేతగా నిలిచాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూడో మొనగాడు.. 20వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన జొకోవిచ్‌
మూడో మొనగాడు.. 20వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన జొకోవిచ్‌
మూడో మొనగాడు.. 20వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన జొకోవిచ్‌

ట్రెండింగ్‌

Advertisement