ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 09, 2020 , 16:28:19

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: జైశ్వాల్‌ అర్ధశతకం

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: జైశ్వాల్‌ అర్ధశతకం

జైశ్వాల్‌, తిలక్‌వర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

పోచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరడంలో ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో విశేషంగా రాణించిన జైశ్వాల్‌ బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ పోరులోనూ ఆకట్టుకుంటున్నాడు.  ప్రత్యర్థి బౌలర్ల నుంచి సవాల్‌ ఎదురవుతున్నా  సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. జట్టు స్కోరు 9 వద్ద దివ్యాంశ్‌ వెనుదిరగడంతో కుదురుకున్న యువ భారత్‌ నిలకడగా ఆడుతోంది. ఆరంభం నుంచి నిదానంగా ఆడుతున్న యశస్వి  89 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 

జైశ్వాల్‌, తిలక్‌వర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడీ 50కి పైగా విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఓపెనర్‌ దివ్యాంశ్‌ స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా..వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌వర్మ.. యశస్వికి స‌హ‌క‌రించాడు.  28 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 95 పరుగులు చేసింది.  logo