శనివారం 28 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 18:15:44

ఆచితూచి ఆడుతున్న భారత్‌

ఆచితూచి ఆడుతున్న భారత్‌

పాక్‌ పేసర్ల బౌలింగ్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌, దివ్యాంన్షు సక్సేనా ఆచితూచి ఆడుతున్నారు.

పోచెఫ్‌స్ట్రూమ్‌(దక్షిణాఫ్రికా): అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. పాక్‌ పేసర్ల బౌలింగ్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌(27), దివ్యాంన్షు సక్సేనా(25) ఆచితూచి ఆడుతున్నారు. ఆమీర్‌ ఖాన్‌ పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత ఓపెనింగ్‌ జోడీ ఆచితూచి ఆడుతూ సింగిల్స్‌ కోసం ప్రయత్నిస్తోంది. 

భారీ షాట్లు ఆడకుండా వికెట్‌ కాపాడుకుంటూ నిదానంగా క్రీజులో కుదురుకుంటున్నారు. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో నిలకడగా  బ్యాటింగ్‌ చేస్తున్నారు.  పాతుకుపోతున్న ఈ జోడీని విడదీసేందుకు పాక్‌ శ్రమిస్తోంది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.  అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 43.1 ఓవర్లలో 172 పరుగులే చేసి ఆలౌటైంది.  ఓపెనర్‌ హైదర్‌ అలీ(56:77 బంతుల్లో 9ఫోర్లు), నజీర్‌(62: 102 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో పాక్‌ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. 


logo