బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 00:39:58

విజయం మాదే: జగన్‌మోహన్‌ రావు

విజయం మాదే: జగన్‌మోహన్‌ రావు

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికల్లో జయేశ్‌ రంజన్‌ నేతృత్వంలోని తమ ప్యానల్‌ అఖండ విజయం సాధిస్తుందని రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు, టోవోఏ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఏ.జగన్‌మోహన్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం శుక్రవారం  ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జయేశ్‌ నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల వరకే మా మధ్య పోటీ ఉంటుంది.. ఆ తర్వాత అందరం ఐకమత్యంతో తెలంగాణ క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీటీ సంఘం కార్యదర్శి ప్రకాశ్‌ రాజ్‌, హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి పవన్‌, సోమేశ్వర్‌ రావు, ఫణిరావు పాల్గొన్నారు.
logo