శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 15:50:01

మహిళా పోలీసుతో క్రికెటర్ జడేజా వాగ్వాదం

మహిళా పోలీసుతో క్రికెటర్ జడేజా వాగ్వాదం

రాజ్ కోట్ : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజ్ కోట్ లో ఒక మహిళా పోలీసుతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాడిగావేడిగా వాగ్వాదం జరుగడంతో ఆరోగ్యం చెడిపోయిన లేడీ హెడ్ కానిస్టేబుల్ సోనాల్ గోసాయి దవాఖాన పాలైంది. ఇప్పటివరకు ఎవరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయలేదని డిప్యూటీ కమిషనర్ మనోహర్ సింగ్ తెలిపారు.

రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో కలిసి ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. ఇద్దరూ ముసుగులు ధరించలేదు. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ సోనాల్ గోసాయి వారి కారును నిలిపి మాస్కులు ధరించలేనందున జరిమానా చెల్లించాలని కోరారు. దాంతో జడేజా.. మహిళా కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగాడు. 

హెడ్ ​​కానిస్టేబుల్ సోనాల్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని జడేజా పోలీసులకు చెప్పారు. తాను ముసుగు ధరించి ఉన్నానని జడేజా పేర్కొన్నారు. వివాదం తరువాత, సోనాల్ చాలా ఉద్రిఘ్నంగా మారి అనారోగ్యం పాలై సమీపంలోని ప్రైవేటు దవాఖానలో చేరారు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ మనోహర్ సింగ్ మాట్లాడుతూ, "జడేజా, లేడీ హెడ్ కానిస్టేబుల్ ఒకరి పట్ల ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. వాగ్వాదానికి దిగారు. అయితే, ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నాకు సమాచారం వచ్చినంత వరకు జడేజా ముసుగు ధరించి ఉండగా, అతడి భార్య ముసుగు ధరించిందీ లేనిదీ తెలియరాలేదు" అన్నారు.


logo