బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 21, 2020 , 18:01:39

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాక్వెస్‌ కలీస్‌

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాక్వెస్‌ కలీస్‌

లండన్‌: శ్రీలంక పర్యటనలో  ఇంగ్లాండ్‌  జట్టుకు  బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలీస్‌ నియమితులయ్యాడు.   వచ్చే  ఏడాది జనవరిలో  ఇంగ్లీష్‌ జట్టు  లంక  టూర్‌కు వెళ్లాల్సి ఉంది.  జనవరి 14న మొదటి టెస్టు ప్రారంభం కాగా, రెండో టెస్టు జనవరి 22 నుంచి మొదలవనుంది.   బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఆదేశానికి విమాన రాకపోకలను ఇతర దేశాలు నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. 

కొవిడ్‌-19 అనిశ్చితి ఉన్నప్పటికీ   ప్రణాళిక ప్రకారమే ముందుకుసాగాలని  ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు  నిర్ణయించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ  అద్భుతంగా రాణించిన  కలీస్‌ సేవలను ఉపఖండ పిచ్‌లపై ఉపయోగించుకోవాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. 

సౌతాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన కలీస్‌ టెస్టుల్లో 55.37 సగటుతో 13,206 పరుగులు సాధించాడు. దాంతో పాటు 292 వికెట్లు పడగొట్టాడు. ఆసియా ఖండంలోనూ మంచి రికార్డే ఉంది. ఈ ప్రాంతంలో  25 టెస్టుల్లో  8 ఎనిమిది సెంచరీలు నమోదు చేశాడు. 

ఇవి కూడా చదవండి:
గేల్‌ తుఫాన్‌ వస్తోంది!

బాక్సింగ్‌ డే టెస్టులో ఆ ఐదుగురికి చోటు!


logo