లండన్: ఆధునిక ఫుట్‌బాల్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్ 55 ఏండ్ల మేజర్ టైటిల్ కరువును తీర్చుకోవాలని తహతహలాడుతున్నది. సొంతగడ్డపై వెంబ్లే మైదానం వేదికగా జరిగే యూరో చాంపియన్‌షిప్ ఫైనల్లో టైటిల్ కోసం ఇటలీతో తలపడేందుకు సిద్ధమైంది. 1966 తర్వాత మేజర్టోర్నీ ఫైనల్‌కు తొలిసారి చేరిన ఇంగ్లండ్ సూపర్‌ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్లో 0-4తో ఉక్రెయిన్ను మట్టికరిపించిన ఇంగ్లిష్ జట్టు.. సెమీస్‌లో డెన్మార్క్‌పై అనూహ్య విజయం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ అదరగొడుతున్నాడు. మరోవైపు ఇటలీ ఇప్పటి వరకు యూరో టైటిల్‌ను ఒక్కసారి (1968) మాత్రమే చేజిక్కించుకుంది. 2000, 2012లో యూరో ఫైనల్స్ వరకు వచ్చినా విజేతగా నిలువలేకపోయింది. కాగా కరోనా నేపథ్యంలో వెంబ్లే స్టేడియంలో ఫైనల్ చూసేందుకు 66వేల మంది అభిమానులను నిర్వాహకులు అనుమతించనున్నారు.