e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home స్పోర్ట్స్ యూరో చాంప్‌ ఇటలీ

యూరో చాంప్‌ ఇటలీ

  • ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై విజయం
  • పెనాల్టీ షూటౌట్‌లో అద్భుత ప్రదర్శన
  • 53 ఏండ్ల తర్వాత ఇటలీకి టైటిల్‌
  • ప్రైజ్‌మనీ
  • విజేత: ఇటలీ 300 కోట్లు

2ఇటలీకి ఇది రెండో యూరో చాంపియన్‌షిప్‌ టైటిల్‌. 1968 తర్వాత మళ్లీ ఇప్పుడు ట్రోఫీ నెగ్గింది.

34ఈ గెలుపుతో ఇటలీ 34 మ్యాచ్‌ల అజేయ యాత్రను కొనసాగించింది. కోచ్‌గా రాబర్టో మాంచిని వచ్చాక ఆ జట్టు సత్తాచాటుతోంది.

యూరో చాంప్‌ ఇటలీ
- Advertisement -

ఇంగ్లండ్‌ గుండె పగిలింది. అర్ధశతాబ్దపు ఎదురుచూపులు ఆవిరయ్యాయి.
యూరో టోర్నీ ఫైనల్‌లో ఇటలీ చేతిలో ఇంగ్లండ్‌ పరాజయం పాలైంది. 55 ఏండ్ల తర్వాత మేజర్‌ టోర్నీ ఫైనల్‌ చేరినా పెనాల్టీ షూటౌట్‌లో చతికిలపడి టైటిల్‌ దక్కించుకోలేకపోయింది.

ఇంగ్లండ్‌ పరిస్థితి ఇది అయితే..ఇటలీ అదరగొట్టింది. అద్భుతమైన ఆటతీరుతో 53 ఏండ్ల తర్వాత యూరో టోర్నీ విజేతగా నిలిచింది. నాలుగేండ్ల క్రితం ప్రపంచకప్‌కు అర్హత సాధించలేక విమర్శలు మూటగట్టుకున్న జట్టు.. ఇప్పుడు యూరో టైటిల్‌ను సగర్వంగా ముద్దాడి సత్తాచాటింది.
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత తొలిసారి ఆ దేశంలో సంబురాలు మిన్నంటాయి. తుదిపోరులో ఓటమి తట్టుకోలేకపోయిన ఇంగ్లండ్‌ అభిమానుల వ్యవహార శైలి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

వెంబ్లే స్టేడియం బయట, లోపల ఇంగ్లిష్‌ ఫ్యాన్స్‌ విధ్వంసం సృష్టించారు. ఇటలీ అభిమానులపై కొందరు దాడులకు తెగబడ్డారు. మరోవైపు పెనాల్టీలను చేజార్చిన తమ దేశ ఆటగాళ్లపైనే సోషల్‌ మీడియాలో జాతివివక్షతో కూడిన అభ్యంతకర దూషణలు చేశారు.

లండన్‌: యూరోపియన్‌ దేశాల ఫుట్‌బాల్‌ సమరంలో ఇటలీ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరిత క్షణాల మధ్య సత్తాచాటి 53 సంవత్సరాల తర్వాత యూరో చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. ఆదివారం ఇక్కడి వెంబ్లే స్టేడియం వేదికగా చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో ఇటలీ పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో ఇంగ్లండ్‌పై గెలిచింది. మ్యాచ్‌ సమయం 1-1తో ముగియడంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పనిసరైంది. ఇంగ్లండ్‌ తరఫున మ్యాచ్‌ రెండో నిమిషంలోనే ల్యూక్‌ షా గోల్‌ బాదితే.. రెండో అర్ధభాగంలో ఇటలీ ప్లేయర్‌ లియోనార్డో బొనూసి (67వ నిమిషం) దాన్ని సమం చేశాడు. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీ గోల్‌కీపర్‌ గియన్‌లుగి డొనారుమా ఇంగ్లండ్‌ను మూడుసార్లు ఆపి సత్తాచాటాడు. 2-1తో ముందున్న సమయంలో చివరి మూడు షూటౌట్‌ అవకాశాలను ఇంగ్లండ్‌ యువ ప్లేయర్లు మార్కస్‌ రష్‌ఫర్డ్‌, జేడన్‌ సంచో, బుకాయో సాకా గోల్స్‌గా మలచలేకపోయారు. తీవ్రమైన ఒత్తిడితో ఆ యువ స్టార్లు తడబడ్డారు. బెరాడీ, బొనుసీ, బెనార్డ్‌డెషీ బంతులను గోల్‌ పోస్టులోకి పంపడంతో ఇటలీ విజయం సాధించింది. 1966 తర్వాత తొలిసారి మేజర్‌ టోర్నీ ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశే మిగిలింది. షూటౌట్‌ మిస్‌ చేశాక 19ఏండ్ల ఇంగ్లండ్‌ జట్టు స్టార్‌ సాకా ఆవేదనను తట్టుకోలేక కన్నీరు పెట్టుకోగా.. కోచ్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ ఓదార్చాడు. పెనాల్టీలను ఎవరికి ఇవ్వాలని తానే నిర్ణయం తీసుకున్నానని, బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు.

ఇంగ్లిష్‌ ఫ్యాన్స్‌ విధ్వంసం
ఫైనల్‌లో తమ జట్టు ఓటమిని తట్టుకోలేకపోయిన కొందరు ఇంగ్లండ్‌ అభిమానులు రచ్చరచ్చ చేశారు. వింబ్లే స్టేడియం బయట ఇటలీ ఫ్యాన్స్‌పై కొందరు దాడి చేశారు. చేతిలో బీరుబాటిళ్లను పగులగొడుతూ.. అరుస్తూ విధ్వంసం సృష్టించారు. స్టేడియం లోపల కూడా కొందరు ఫ్యాన్స్‌ బీభత్సం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.

ప్లేయర్లపై జాతివివక్ష దూషణలు
ఫైనల్‌ షూటౌట్‌లో చివరి మూడు అవకాశాలను మిస్‌ చేసిన తమ జట్టు నల్లజాతి ప్లేయర్లు రష్‌ఫోర్డ్‌, జాడోన్‌ సంచో, బుకాయో సకాను కొందరు ఇంగ్లండ్‌ అభిమానులే సోషల్‌ మీడియాలో అభ్యంతరకంగా దూషించారు. జాతివివక్షతో కూడిన కామెంట్లు చేశారు. వీటిని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ పీటర్సన్‌ సహా మరికొందరు తీవ్రంగా ఖండించారు.

ఇటలీలో సంబురాలు
కరోనాతో అపార నష్టాన్ని చవిచూసిన ఇటలీ ప్రజలకు యూరో కప్‌ విజయం సంబురాన్ని తెచ్చిపెట్టింది. దీంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. తమ జట్టుకు ఘన స్వాగతం పలికారు. కరోనా నిబంధనలను ఏ మాత్రం పాటించకపోవడంతో వైరస్‌ ముప్పు మరోసారివస్తుందేమోనని వైద్య నిపుణులు హెచ్చరించారు.

గోల్డెన్‌ బూట్‌ – క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్‌ కెప్టెన్‌ – 4 మ్యాచ్‌ల్లో 5గోల్స్‌)
గోల్డెన్‌ బాల్‌ (ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ) – గియాన్‌లుగి డొనరుమా (ఇటలీ గోల్‌కీపర్‌)
యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ – పెడ్రి (స్పెయిన్‌ మిడ్‌ఫీల్డర్‌)
స్టార్‌ ఆఫ్‌ ది ఫైనల్‌ – లియోనార్డో బొనుసీ (ఇటలీ మిడ్‌ఫీల్డర్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యూరో చాంప్‌ ఇటలీ
యూరో చాంప్‌ ఇటలీ
యూరో చాంప్‌ ఇటలీ

ట్రెండింగ్‌

Advertisement