గురువారం 02 జూలై 2020
Sports - Apr 17, 2020 , 17:03:15

ఐపీఎల్ రద్దవుతుందేమో: కేరీ

ఐపీఎల్ రద్దవుతుందేమో: కేరీ

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ అలెక్స్ కేరీ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా భారత్​తో లాక్​డౌన్​ను మే 3వతేదీ వరకు పొడిగించడంతో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్​ 13వ సీజన్​ను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆరునెలల పాటు దేశ సరిహద్దులను మూసేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ నిర్వహణపై కేరీ శుక్రవారం అనుమానం వ్యక్తం చేశాడు.

‘ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు. ఈ సమయంలో ఢిల్లీలో  క్యాపిటల్స్ జట్టు​ తరఫున క్రికెట్ ఆడుతుంటే ఎంతో బాగుండేదనిపిస్తున్నది’ అని కేరీ చెప్పాడు. 13వ సీజన్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్.. కేరీని దక్కించుకుంది. అతడు ఐపీఎల్​కు ఎంపికవడం ఇదే తొలిసారి. 


logo