శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 21, 2021 , 14:22:34

ఐపీఎల్ వేలంలో త‌న‌ను తీసుకోక‌పోవ‌డంపై ఫించ్ రియాక్ష‌న్ ఇదీ

ఐపీఎల్ వేలంలో త‌న‌ను తీసుకోక‌పోవ‌డంపై ఫించ్ రియాక్ష‌న్ ఇదీ

మెల్‌బోర్న్‌: ఈ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టాప్ ఆట‌గాళ్ల‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ కూడా ఒక‌రు. గ‌త సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్‌కు ఆడిన అత‌న్ని ఈసారి ఆ టీమ్ విడిచిపెట్టింది. అయితే ఈ నెల 18న జ‌రిగిన వేలంలో ఫించ్‌ను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఆస్ట్రేలియాకే చెందిన యువ ఆట‌గాళ్లు కోట్లు ప‌లికిన చోట‌.. టీ20 స్పెష‌లిస్ట్ అయిన ఫించ్‌ను తీసుకోక‌పోవ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 

అయితే ఈ విష‌యాన్ని ఫించ్ మాత్రం తేలిగ్గా తీసుకున్నాడు. మ‌ళ్లీ ఆడితే బాగుండేది. ఇది చాలా మంచి టోర్నీ. నిజం చెప్పాలంటే న‌న్ను తీసుకోర‌ని ఊహించ‌లేదు అని అన‌ను. నేను క్రికెట్ ఆడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. కానీ ఈసారి ఇంట్లో కాస్త ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం రావ‌డం మంచి విష‌య‌మే అని ఫించ్ అన్నాడు. గ‌తేడాది బెంగ‌ళూరు త‌ర‌ఫున 12 మ్యాచ్‌లు ఆడిన ఫించ్.. 268 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్ రెడీ అవుతోంది. 

VIDEOS

logo