బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 22:14:08

పోలీసులు చేసిన పనికి యువీ ఫిదా

పోలీసులు చేసిన పనికి యువీ ఫిదా

ఓ యాచకుడికి తమ ఆహారాన్ని ఇచ్చిన పోలీసుల మంచి మనసుకు టీమ్ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ ఫిదా అయిపోయాడు. ఈ పోలీసుల మానవత్వం తన హృదయాన్ని హత్తుకుందంటూ ఆ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. “ఈ పోలీసులు చేసిన మానవత్వమైన పని నా హృదయాన్ని హత్తుకుంది. వారి వెంట తెచ్చుకున్న ఆహారాన్ని ఇవ్వడం ఎంతో దయాగుణమైన చర్య. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కరుణ చూపడంతో వారి పట్ల గౌరవం మరింత పెరిగింది” అని యువీ పేర్కొన్నాడు. కరోనా వైరస్​పై జరుగుతున్న పోరాటంలో పోలీసులు అలుపెరుగని యోధుల్లా కష్టపడుతూనే ఉన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయటకు వచ్చిన వారికి అవగాహన కల్పిస్తున్నారు. అక్కడక్కడా ఆకలితో ఉన్న వారి కడుపులను నింపుతూ మానవత్వాన్ని చూటుకుంటున్నారు. 


logo