శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 00:47:27

అమ్మాయిల ఆటకు వేళాయె

అమ్మాయిల ఆటకు వేళాయె

  • నేటి నుంచి మహిళల ఐపీఎల్‌.. మూడు జట్లు.. నాలుగు మ్యాచ్‌లు

షార్జా: అత్యుత్తమ భారత మహిళా క్రికెటర్లు.. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్ల మేళవింపుతో క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు టీ20 చాలెంజ్‌(మహిళల ఐపీఎల్‌) సిద్ధమైంది. షార్జా వేదికగా బుధవారం టోర్నీ ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో సుదీర్ఘ విరామం రాగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి భారత ప్లేయర్లు మైదానంలోకి దిగనున్నారు. నాలుగు మ్యాచ్‌లు జరిగే టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌నొవాస్‌, గతేడాది రన్నరప్‌ వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్‌ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు టైటిళ్లను గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని నొవాస్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో మిథాలీ నేతృత్వంలోని వెలాసిటీతో ఆ జట్టు బుధవారం తలపడనుంది. 16ఏండ్ల సంచలనం షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్‌, మిథాలీపైనే ఎక్కువగా వెలాసిటీ ఆధారపడి ఉంది. ఇక గత సీజన్‌లో హర్మన్‌ రెండు అర్ధశతకాలతో అదరగొట్టింది. మరోవైపు మంధన కెప్టెన్సీలోని ట్రైల్‌బ్లేజర్స్‌లో సీనియర్లు జులన్‌ గోస్వామి,  ఎక్లెస్టోన్‌ లాంటి స్టార్లు ఉన్నారు.  సుదీర్ఘ విరామం తర్వాత ప్లేయర్ల ఫిట్‌నెస్‌, ఆటతీరు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.