మంగళవారం 07 జూలై 2020
Sports - May 05, 2020 , 00:41:56

జట్లను తీసుకురావడం సమస్య కాదు

జట్లను తీసుకురావడం సమస్య కాదు

  • ఆస్ట్రేలియా క్రీడాశాఖ మంత్రి కోల్‌బెక్‌

మెల్‌బోర్న్‌:  టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు ఇతర జట్లను తీసుకురావడం పెద్ద సమస్య కాదని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి రిచర్డ్‌ కోల్‌బెక్‌ అన్నారు. అయితే ప్రేక్షకులు లేకుండా టోర్నీ నిర్వహిస్తే ఏమైనా విలువ ఉంటుందా.. లేదా అనే అంశమే ముఖ్యమైనదని సోమవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆస్ట్రేలియా - భారత్‌ మధ్య టెస్టు సిరీస్‌ జరుగాలని నేను కోరుకుంటున్నా. ప్రపంచకప్‌ను కూడా తప్పకుండా నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. టోర్నీ కోసం జట్లను తీసుకురావడం పెద్ద సమస్య కాదు. అయితే మ్యాచ్‌లకు ప్రేక్షకుల హాజరు విషయంలోనే ఆలోచనలో ఉన్నాం. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రికెట్‌ ప్రపంచం మొత్తం అదే ఆలోచిస్తున్నది’ అని కోల్‌బెక్‌ చెప్పారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ రాకపోతే అందరం చాలా నిరాశ చెందుతామని ఆ దేశ యువ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ అన్నాడు.  logo