సోమవారం 25 మే 2020
Sports - Apr 06, 2020 , 18:22:56

కరోనా ఎఫెక్ట్​: షూటింగ్ ప్రపంచకప్ రద్దు

కరోనా ఎఫెక్ట్​: షూటింగ్ ప్రపంచకప్ రద్దు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మే నెలలో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ప్రపంచకప్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రద్దయింది. తొలుత షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి 26వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. వైరస్ వల్ల మే నెలకు వాయిదా పడింది. తదుపరి షెడ్యూల్ ప్రకారం రైఫిల్​, పిస్టల్ పోటీలు మే 5 నుంచి 12వ తేదీ వరకు, షాట్​గన్​ పోటీలు జూన్​ 2నుంచి 9వ తేదీ వరకు జరగాల్సింది. అయితే కరోనా తీవ్రత పెరుగుతుండడంతో షూటింగ్ ప్రపంచకప్ రద్దు అనివార్యమైంది. ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్​ సమాఖ్య(ఐఎస్​ఎస్​ఎఫ్​) సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించకూడదని భారత జాతీయ రైఫిల్ సంఘం(ఎన్ఆర్​ఏఐ)పై కూడా కొంతకాలంగా ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. 


logo