శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 18, 2020 , 03:01:47

బెంగళూరుకు బ్రేక్‌

బెంగళూరుకు బ్రేక్‌

ముంబై : ఐఎస్‌ఎల్‌ ఆరో సీజన్‌లో జోరు మీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు ఎఫ్‌సీకి ముంబై సిటీ జట్టు బ్రేకులేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ 2-0తేడాతో సునీల్‌ ఛెత్రీ సేనపై విజయం సాధించింది. మ్యాచ్‌ 13వ నిమిషంలోనే ముంబై ప్లేయర్‌ మొదో సౌగౌ షాట్‌ కొట్టగా బంతిని ఆపడంలో బెంగళూరు గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు విఫలమయ్యాడు. దీంతో ముంబై ఖాతా తెరిచింది. రెండో అర్ధభాగంలో అమినే చెర్మితి(55వ నిమిషం) గోల్‌ చేసి ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. 


logo