శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 12, 2020 , 01:54:00

హైదరాబాద్‌ను వీడిన హెడ్‌కోచ్‌ బ్రౌన్‌

హైదరాబాద్‌ను వీడిన హెడ్‌కోచ్‌ బ్రౌన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఐఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌   (హెచ్‌ఎఫ్‌సీ) హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి ఫిల్‌ బ్రౌన్‌  తప్పుకున్నాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం శనివారం ప్రకటించింది. జట్టును బ్రౌన్‌ అద్భుతంగా ముందుకు నడిపించారని, భవిష్యత్తు ప్రయత్నాల్లోనూ ఆయన సఫలీకృతం కావాలని కోరుకుంటున్నామని జట్టు సహయజమాని వరుణ్‌ త్రిపురనేని అన్నా రు. ఈ సీజన్‌ ఐఎస్‌ఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన హెచ్‌ఎఫ్‌సీకి బ్రౌన్‌ తొలి హెడ్‌కోచ్‌గా పనిచేసిన సంగతి  తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ తొమ్మిదింట ఓడి పేలవ ప్రదర్శన చేసింది. ఓ మ్యాచ్‌ గెలుపు, రెండు డ్రాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.


logo