శనివారం 28 మార్చి 2020
Sports - Feb 06, 2020 , 00:42:43

హైదరాబాద్‌కు మరో ఓటమి

 హైదరాబాద్‌కు మరో ఓటమి

  • ఐఎస్‌ఎల్‌లో    

మాడ్గావ్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో తన అరంగేట్ర సీజన్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న హైదరాబాద్‌ ఎఫ్‌సీ 16మ్యాచ్‌ల్లో డజను పరాజయాలు నమోదు చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 1-4తేడాతో ఆతిథ్య గోవా ఎఫ్‌సీ చేతిలో మరో ఘోర ఓటమి చెందింది. గోవా ఆటగాళ్లు హుగో బౌమోస్‌(19వ, 50వ నిమిషాల్లో), ఫెర్రన్‌ కోరోమినాస్‌(64వ, 87వ ని.) డబుల్‌ గోల్స్‌ చేసి సత్తాచాటారు. హైదరాబాద్‌ తరఫున స్టార్‌ ప్లేయర్‌ మార్సెలినో(64వ ని.) ఒక్కడే ఫ్రీకిక్‌ సాయంతో గోల్‌ చేయగలిగాడు. ఆరంభం నుంచి డిఫెన్స్‌కే ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగినా గోవాను హైదరాబాద్‌ ఆటగాళ్లు అడ్డుకోలేకపోయారు. ఈ విజయం తో గోవా ఎఫ్‌సీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 


logo