సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 08, 2021 , 13:18:57

ఇషాంత్ శ‌ర్మ‌@300 వికెట్లు

ఇషాంత్ శ‌ర్మ‌@300 వికెట్లు

చెన్నై: టీమిండియా పేస్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌ టెస్టుల్లో 300 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌‌లో డాన్ లారెన్స్ (18)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయ‌డం ద్వారా ఇషాంత్ ఈ ఘ‌నత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసుకున్న ఆరో ఇండియ‌న్ బౌల‌ర్‌గా ఇషాంత్ నిలిచాడు. అత‌ని కంటే ముందు అనిల్‌కుంబ్లే, క‌పిల్ దేవ్‌, హ‌ర్భ‌జన్ సింగ్‌, జ‌హీర్ ఖాన్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఉన్నారు. కెరీర్‌లో 98వ టెస్ట్ ఆడుతున్న ఇషాంత్.. 32 స‌గ‌టుతో 300 వికెట్లు తీసుకున్నాడు. 

VIDEOS

logo