శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 17, 2020 , 02:00:48

మాంబ్రే పర్యవేక్షణలో ఇషాంత్‌

మాంబ్రే పర్యవేక్షణలో ఇషాంత్‌

బెంగళూరు: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో గాయపడ్డ భారత సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ.. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చెమటోడుస్తున్నాడు. తిరిగి ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. మాజీ పేసర్‌ పరాస్‌ మాంబ్రే పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌ పర్యటనకు ఇప్పటికే జట్లను ప్రకటించినప్పటికీ.. ఇషాంత్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే అతడిని ఆస్ట్రేలియాకు పంపుతామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.