సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 28, 2020 , 17:00:27

రెండో టెస్టుకు ఇషాంత్‌ శర్మ దూరం

రెండో టెస్టుకు ఇషాంత్‌ శర్మ దూరం

క్రైస్ట్‌చర్చ్‌:  ఆతిథ్య న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు సన్నద్ధమవుతున్న భారత జట్టుకు ఊహించని షాక్‌. టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయంతో శనివారం నుంచి జరిగే రెండో టెస్టుకు దూరంకానున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో గొప్పగా రాణించిన ఇషాంత్‌ స్థానంలో మరో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం రంజీ ట్రోఫీలో ఆడుతుండగా మడమ గాయం కావడంతో బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లిన ఇషాంత్‌  కోలుకొని తొలి టెస్టు ఆరంభానికి ముందే జట్టులోకి వచ్చాడు. తాజాగా గాయం తిరగబడటంతో శుక్రవారం స్కానింగ్‌ కూడా చేశారు.  

వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టులో లంబూ ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. ఉమేశ్‌ చివరిసారిగా(విదేశీ గడ్డపై) 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు కనీసం ఒక్క టెస్ట్‌ కూడా ఆడలేదు. యువ పేసర్‌ నవదీప్‌ సైనీ కూడా తుది జట్టులో చోటు దక్కించుకొని సుధీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 0-1తో వెనుకంజలో ఉంది. logo