కపిల్‌దేవ్ తర్వాత తొలిపేసర్‌గా నిలువనున్న ఇషాంత్

అహ్మదాబాద్: మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో కెరీర్ ఆరంభించా. ఆ తర్వాత కుంబ్లే, ధోనీ, కోహ్లీ, రహానే ఇలా చాలా మంది కెప్టెన్సీలో ఆడా. నాయకుడు పేసర్లను ఎలా వాడుకుంటాడనేది ముఖ్యం. ఈ విషయంలో నా సారథులు నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారు. కెప్టెన్ ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవడం ముఖ్యం. అది అర్థమైతే విజయవంతంగా ముందుకు సాగవచ్చు.
వన్డేలు ఆడనందుకు బాధలేదు
పరిమిత ఓవర్ల క్రికెట్లో నన్ను ఎంపిక చేయకపోవడంపై చింతించడం లేదు. సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషిస్తున్నా. వన్డేలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే.. టెస్టుల ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే దాన్ని పక్కన పెట్టి సుదీర్ఘ ఫార్మాట్ కోసం నన్ను నేను కొత్తగా మలుచుకున్నా.
నా తర్వాత అతడే..
భారత పేస్ దళానికి నా తర్వాత ఎక్కువ కాలం సేవలందించగలిగే సత్తా జస్ప్రీత్ బుమ్రాలో ఉంది. అత్యుత్తమ ఆటగాైళ్లెతేనే ఇక్కడి వరకు వస్తారు. అలాంటి వారిని కాస్త తీర్చిదిద్దుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఈ విషయంలో బుమ్రా బౌలింగ్ దాడికి నాయకుడిలా కనిపిస్తాడు. మహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీలో మంచి వేగం ఉంది. వాళ్లు ఇదే నిలకడ కొనసాగించడం ముఖ్యం.
ఇదో అంకె మాత్రమే..
వందో టెస్టు అనేది ప్రత్యేకమైనదేమీ కాదని నా ఉద్దేశం. గత మ్యాచ్‌లో ఎలాంటి తీవ్రతతో ఆడానో.. మొతెరాలోనూ అలాంటి దృక్పథంతోనే బరిలోకి దిగుతా. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు విజయాలు సాధిస్తేనే ఎక్కువ ఆనందిస్తా. విజయాల్లో కీలక పాత్ర పోషించే సత్తా ఉన్నం త కాలం భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా.
ఆసక్తితో ఉన్నాం..
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి స్వింగ్ అవడం సహజం. అయితే మంచు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకం. సెషన్ల వారిగా పిచ్‌లో మార్పులు ఉంటాయనుకుంటున్నా. పింక్ బంతి స్వింగ్ అవడం మానేస్తే.. సులువుగా బ్యాట్ మీదకు వస్తుంది. అలాంటి సమయంలో స్పిన్నర్లు ప్రధానమవుతారు. అందుకే జట్టు కూర్పు, ఎవరు కీలకం అనేది ఇప్పుడే చెప్పలేం. మొతెరా స్టేడియం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు మేమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం.
ఉమేశ్ వచ్చేశాడు
ఇంగ్లండ్‌తో జరుగనున్న చివరి రెండు టెస్టులకు భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన మధ్య నుంచి తప్పుకున్న ఉమేశ్ ఫిట్నెస్ టెస్టు పాసయ్యాడు. దీంతో జట్టుతో ఉన్న శార్దుల్ ఠాకూర్‌ను బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీ కోసం అనుమతించింది. ‘ఆదివారం మొతెరాలో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో ఉమేశ్ ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు అతడిని ఎంపిక చేశాం’అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
- నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తా
- నా కష్టాలు గుర్తొచ్చాయి
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- జవ్వని సొగసుకు..జడ నగలు!
- ములుగు పిజ్జా.. మహా రుచి!
- గ్రీన్ పకోడి
- మహిళకు ‘పింక్' రక్ష!