శనివారం 15 ఆగస్టు 2020
Sports - Feb 16, 2020 , 14:47:41

భారత్‌కు గుడ్‌న్యూస్‌.. ఇషాంత్‌ వచ్చేస్తున్నాడు

భారత్‌కు గుడ్‌న్యూస్‌.. ఇషాంత్‌ వచ్చేస్తున్నాడు

ఇషాంత్‌ రాకతో భారత పేస్‌ విభాగం పటిష్టం కానుంది.

బెంగళూరు:  న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టుకు శుభవార్త. గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఫిట్‌నెస్‌  టెస్టులో నెగ్గాడు.   బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో ఇషాంత్‌ పాసయ్యాడు. ఆదివారం భారత్‌ నుంచి బయలుదేరి వెల్లింగ్టన్‌లో ఉన్న భారత జట్టుతో అతడు కలవనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.  రంజీ ట్రోఫీలో భాగంగా గత నెల 20న విదర్భతో మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతుండగా ఇషాంత్‌ గాయపడ్డాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 21న తొలి టెస్టు ఆరంభంకానుంది. కివీస్‌తో వన్డే సిరీస్‌లో భారత పేసర్లు తేలిపోయిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఇషాంత్‌  రాకతో భారత పేస్‌ విభాగం పటిష్టం కానుంది.  


logo