సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 20, 2021 , 14:59:47

ఇర‌గ‌దీసిన ఇషాన్ కిష‌ణ్.. 94 బంతుల్లో 173 ర‌న్స్‌

ఇర‌గ‌దీసిన ఇషాన్ కిష‌ణ్.. 94 బంతుల్లో 173 ర‌న్స్‌

ఇండోర్‌: విజ‌య్ హ‌జారే ట్రోఫీ మ్యాచ్‌లో ఇషాన్ కిష‌ణ్ ఇర‌గ‌దీశాడు.  ఇండోర్ వేదికగా జ‌రుగుతున్న ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో జార్ఖండ్ స్టార్ ఇషాన్ దుమ్మురేపాడు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను కేవ‌లం 94 బంతుల్లోనే 173 ర‌న్స్ చేశాడు.  భారీ షాట్ల‌తో హోరెత్తించిన ఇషాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్స్‌లు, 19 ఫోర్లు ఉన్నాయి.  ఇషాన్ దూకుడుతో.. 50 ఓవ‌ర్ల స్వ‌దేశీ టోర్నీల్లో జార్ఖండ్ జ‌ట్టు అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసింది.  జార్ఖండ్ త‌మ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 422 ర‌న్స్ చేసింది.  అయితే గ‌తంలో విజ‌య్ హ‌జారే ట్రోఫీలో అత్య‌ధిక స్కోర్ సాధించిన ఘ‌న‌త మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌ట్టుపై ఉన్న‌ది.  2010 టోర్నీలో రైల్వేస్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఆరు వికెట్ల‌కు 412 ర‌న్స్ చేసింది. విజ‌య్ హ‌జారే టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు చేసిన వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిష‌ణ్ నిలిచాడు. తొలి హాఫ్ సెంచ‌రీని 40 బంతుల్లో పూర్తి చేశాడు ఇషాన్‌. ఇక ఆ త‌ర్వాత భారీ సిక్స‌ర్ల‌తో  బెంబేలెత్తించాడు.  కిష‌ణ్ అటాకింగ్ ఆట‌తో కేవ‌లం 16.2 ఓవ‌ర్ల‌లో జార్ఖండ్ వంద ర‌న్స్ పూర్తి చేసింది. 173 వద్ద అత‌ను స్టంప్ అవుట్ అయ్యాడు.   

VIDEOS

logo