ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 11, 2020 , 10:23:12

ఇషాన్ కిష‌న్.. వెరీ స్పెష‌ల్‌ ప్లేయ‌ర్‌

ఇషాన్ కిష‌న్.. వెరీ స్పెష‌ల్‌ ప్లేయ‌ర్‌

హైద‌రాబాద్‌:  ముంబై క్రికెట‌ర్ ఇషాన్ కిష‌న్‌పై .. మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ప్ర‌శంస‌లు కురిపించాడు.  ముంబై ఐపీఎల్ జ‌ట్టులో మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడే ఎడ‌మ చేతి బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్‌.. ఓ ప్ర‌త్యేకమైన ప్లేయ‌ర్ అని యువీ కీర్తించాడు. దుబాయ్‌లో జ‌రిగిన ఐపీఎల్ టోర్నీలో టైటిల్ గెలిచిన ముంబై జ‌ట్టుకు యువీ కంగ్రాట్స్ చెప్పాడు.  ఈ సంద‌ర్భంగా ఇషాన్ కిష‌న్ గురించి కూడా కామెంట్ చేశాడు.  అద్భుత‌మైన క్రికెట‌ర్‌గా ఇషాన్ కిష‌న్ రూపాంత‌రం చెందుతున్న‌ట్లు యువీ తెలిపాడు. ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్‌.. 57.33 స‌గ‌టుతో మొత్తం 516 ర‌న్స్ చేశాడు. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో ఇషాన్ కిష‌న్ అయిద‌వ స్థానంలో ఉన్నాడు.  మంగ‌ళ‌వారం జ‌రిగిన ఫైన‌ల్లో ఇషాన్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అత‌ను 19 బంతుల్లో అజేయంగా 33 ర‌న్స్ చేశాడు. ఇదే సీజ‌న్‌లో ఆర్సీబీపై 99 ర‌న్స్ చేశాడు.