సోమవారం 25 మే 2020
Sports - Mar 29, 2020 , 21:19:35

ఇషాసింగ్ రూ.30 వేల విరాళం

ఇషాసింగ్ రూ.30 వేల విరాళం

 

హైద‌రాబాద్‌: వ‌య‌సులో చిన్న‌ది అయినా..పెద్ద మ‌న‌సు చాటుకుంది తెలంగాణ యువ షూట‌ర్ ఇషాసింగ్‌. ప్ర‌మాద క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు తాను సైతం అంటూ ముందుకొచ్చింది. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ప్ర‌ధాన మంత్రి స‌హాయ‌ నిధికి ఆదివారం రూ.30 వేలు విరాళమిచ్చింది. ‘నా సేవింగ్స్ అకౌంట్ నుంచి పీఎం కేర్ ఫండ్‌కు రూ.30వేలు స‌హాయం చేస్తున్నాను. దేశ్ హే తో హ‌మ్ హే’ అంటూ ఇషా త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చింది. దీనిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు స్పందిస్తూ ‘15 ఏండ్ల వ‌య‌సులో నువ్వు చూపించిన ప‌రిణ‌తి అద్భ‌తం. నువ్వు రియ‌ల్ చాంపియ‌న్‌’ అని పొగిడారు. 
logo